ఏదీ.. ఆ భరోసా

2 Sep, 2016 00:23 IST|Sakshi
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలనారంగ చరిత్రలో ఆయనది చెరగని సంతకం. ఆయన సాగించిన అభివృద్ధి.. ప్రజాసంక్షేమ ప్రస్థానం మరువలేని జ్ఞాపకం. ఆ మహానేత మరణించి ఏడేళ్లు గడచినా.. జిల్లా ప్రజలు ఆయనకు గుండెల్లో గుడికట్టి నేటికీ పూజిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా మన జిల్లాపై ఎనలేని మమకారం చూపించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రైతన్నకు భరోసా ఉంటుందని నమ్మారు. దాని కోసం ఆయన తపించారు. జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. డెల్టాను ఆధునికీకరించడం ద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ఆకాంక్షించారు. దానికోసం ఆగమేఘాలపై పనులు ప్రారంభించారు. వైఎస్‌ మరణంతో ఆ పనులు మూలనపడ్డాయి. తర్వాత పాలకులు డెల్టా ఆధునికీకరణపై దృష్టి పెట్టలేదు. కనీసం నిర్వహణ పనులు కూడా సక్రమంగా జరగకపోవడం డెల్టా రైతులకు శాపంగా మారింది. ఈ ఏడాది గోదావరిలో నీరున్నా డెల్టాలో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది.
రైతు బాంధవుడిగా..
రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంత రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతు రుణాలు మాఫీ చేసిన రైతు బాంధవుడిగా అన్నదాతలంతా ఆయనను నేటికీ కొలుస్తూనే ఉన్నారు. ఆయన మరణానంతరం రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు దఫాల్లో ఇచ్చిన సొమ్ము వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి ఉండగా, రైతులకు కొత్తగా రుణాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ౖÐð ఎస్‌ ఏ వర్గం ప్రజలనూ విస్మరించలేదు. ఆరోగ్యశ్రీ పథకంతో వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించారు. వైద్యం అందక పేద, మధ్య తరగతికి చెం దిన ఏ ఒక్కరూ మృత్యువాత పడకూడదనే సంకల్పంతో అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చారు. వైఎస్‌ మృతి చెందాక ఆ పథకాన్ని పాల కులు నిర్వీర్యం చేశారు. పథకం పేరు మార్చి అందులో సగానికి పైగా వ్యాధులను తొలగించడంతో ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది. గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు, ఉచితంగా మందులు అందించే 104 పథకం మూలనపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించారు. జిల్లాలో వేలాది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చింది.  దీంతె పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. వైఎస్‌హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరుగులు తీశాయి. నిత్య సమీక్షలతో సంక్షేమ ప్రగతిని సామాన్యులకు అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. పింఛన్లు, అభయహస్తం, పావలా వడ్డీ పథకం ఏదైనా ప్రస్తుతం నిధుల లేమితో చతికిలపడింది. వీటిలో కొన్నింటికి పేరు మార్చగా,  మిగిలిన వాటిని నిధుల లేమి వెంటాడుతోంది. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వైఎస్‌ వెలుగు నింపితే.. ఇప్పటి ప్రభుత్వం రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను డిఫాల్టర్లుగా మార్చిం ది. జీవితంలో ఎప్పుడూ వారికి రుణాలందకుండా చేసింది. చంద్రబాబుకు ఓటు వేసిన పాపానికి డ్వాక్రా మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  
 
మరిన్ని వార్తలు