ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా..?

8 Sep, 2016 00:11 IST|Sakshi
ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా..?
  •  వైఎస్సార్‌టీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి ఓబులపతి
  • గార్లదిన్నె : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌ టీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి  పేర్కొన్నారు. వైఎస్సార్‌టీఎఫ్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాపరిరక్షణ యాత్రలో భాగంగా బుధవారం మండల వ్యాప్తం గా ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్లో సమావేశాలు నిర్వహిం చారు.

    కొప్పలకొండలో డీఇఓ అంజయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణయాత్రకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు.  ఓబుళపతి మాట్లాడుతూఉపాధ్యాయ సాహర్థ్య పరీక్షలను  వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌టీఎఫ్‌ పని చేస్తుందని తె లిపారు.   వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి , వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా నాయకులు అజీమొద్దీన్, పవన్‌కుమార్, శివప్రసాద్, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

     

మరిన్ని వార్తలు