అసమానతల తొలగింపునకు విద్య దోహదం

16 Sep, 2016 20:43 IST|Sakshi
అసమానతల తొలగింపునకు విద్య దోహదం
 
బి.సి.సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర
 
విజయవాడ (మొగల్రాజపురం): 
ఆర్థిక అసమానతలను విద్యతోనే తొలుగుతాయని తమ ప్రభుత్వం  నమ్ముతుందని అబ్కారీ, బి.సి. సంక్షేమం–సాధికారిత, చేనేత శాఖా మంత్రి  కొల్లు రవీంద్ర అన్నారు. పి.బి.సిద్ధార్థ ఆడిటోరియంలో శుక్రవారం ‘విదేశీ విద్యా దీవెన’ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ విదేశాల్లో చదువుకునే కాపు విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు తమ ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే కాపు విద్యార్థులకు రూ.10 లక్షలు సబ్సిడీగా అందజేస్తున్నామని తెలిపారు. 206 మంది కాపు విద్యార్థులు ఈ పథకంలో భాగంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారన్నారు. బి.సి కులల వారికి ఇప్పటికే 304 కోట్ల రుపాయలను సెల్ప్‌ ఎంప్లాయిమెంట్‌ కింద రుణాలుగా మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రజలు కేవలం చేతి వృత్తుల ద్వారానే కాకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ్య మాట్లాడుతూ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల విద్యార్థులు విదేశీ విద్యా దీవెన పథకంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం వెయ్యి కోట్ల రుపాలను కాపు కులాలకు చెందిన వ్యక్తులకు రుణాలుగా మంజూరు చేయనున్నామన్నారు.  ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బి.సి.సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనంతరాము, కాపు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌తోపాటుగా కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్లు, బి.సి, కాపు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు