విద్యను అందరికీ అందుబాటులోకి ఉంచాలి

3 Sep, 2016 21:32 IST|Sakshi
విద్యను అందరికీ అందుబాటులోకి ఉంచాలి
కోదాడ : విద్యతోనే తెలంగాణ సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకు ప్రతి ఒక్కరికీ విద్యను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోందడరామ్‌ అన్నారు. శనివారం కోదాడలో జరిగిన ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం 81వ వార్షికోత్సవం సందర్భంగా ‘విద్య–ఉద్యోగం–ఉపాధి కల్పనలో పాలక వర్గాల వైఫల్యం’ అనే అంశంపై సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యా సంస్థలు బలహీనంగా మారాయన్నారు. ప్రస్తుతం వాటిని బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్‌ విద్యా సంస్థలను నియంత్రించాచాలన్నారు. కార్పొరేట్‌ సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, వారికి సామాజిక బాధ్యత ఉండదని, దానివల్ల సమాజంలో అసమానతలు ఏర్పడతామన్నారు. కార్పొరేట్‌ వ్యాపారులు ఉత్తమ బోధకులను తమ గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల సాధారణ కళాశాలల్లో బోధించే కరువవుతున్నారన్నారు. దీంతో సామాన్యులు తలతాకట్టు పెట్టి లక్షలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారన్నారు. ఫలితంగా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థి సంఘాలు విద్యా సంబంధం అంశాలపై రాజీలేని పోరాటాలు చేయాలన్నారు. అంతకు ముందు విద్యార్థి సంఘం పతకాన్ని ఆవిష్కరించారు. చేపూరి కొండలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, ధర్మార్జున్, మేకల శ్రీనివాస్, బొల్లు ప్రసాద్, ఎస్‌.కె లత్తు, బరిగెల వెంకటేశ్, రాము, కొండూరి వెంకటేష్, నరేష్, జగన్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు