ఆగస్టు 1న విద్యాసంస్థల బంద్

26 Jul, 2016 19:32 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జేఏసీ ఆధ్వర్యాన బంద్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు.

 

కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చుదిద్దుతామని ప్రకటనలు చేస్తూనే చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోందన్నారు. ఏడు ప్రధాన డిమాండ్లతో చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, రవిచంద్ర (పీడీఎస్‌యూ), ఎన్.కోటి (ఎస్‌ఎఫ్‌ఐ), షేక్ బాజీసైదా (పీడీఎస్‌ఓ), సీహెచ్.రఘువీరా, షెహెన్‌షా (ఏఐఎస్‌ఎఫ్) పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు