గుప్త నిధుల తవ్వకాల కేసులో..

2 Jun, 2017 04:53 IST|Sakshi
గుప్త నిధుల తవ్వకాల కేసులో..

ఎనిమిది మంది అరెస్ట్‌..
పరారీలో మరో ముగ్గురు..

భువనగిరి, అర్బన్‌ :గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ఎనిమిది మందిని  పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం భువనగిరిలోని డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏసీపీ ఎస్‌.మోహన్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలను వెల్లడిం చారు. 

బొమ్మలరామారం మండలం మర్యాల గ్రా మ శివారులో ఉన్న మైసమ్మ ఆలయం పక్కనే ఉన్న దానంబండను స్థానికులు పవిత్రంగా కొలుస్తు పూజ లను నిర్వహిస్తారు. దానంబండ కింద గుప్త నిధులు ఉన్నట్లు ఈ నెల 24న అదే గ్రామానికి చెందిన కురిమండ్ల శ్రీనివాస్‌గౌడ్, ఈదులకంటి సంజీవరెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, ఉప్పునుతల రామ్‌దాస్, సంగి సుదర్శన్, చౌదరపల్లి గ్రామానికి చెందిన పక్కీరు ధర్మారెడ్డి, గుండెబొయిన కృష్ణ(జేసీబీ డ్రైవర్‌), పక్కీర్‌గూడునికి చెందిన గంగదేవి నర్సింహ్మ, కరీంనగర్‌ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు రాజు, సోమయ్య, గుర్తు తెలియని మరో వ్యక్తి జేసీబీ సాయంతో దానంబండ కింది భాగంలో తవ్వకాలు జరిపారు. వీరికి ఎలాంటి గుప్త నిధులు లభించ లేదు.

అదే గ్రామానికి చెందిన తూంకుంట విఠల్‌ 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో గుర్తించిన 11 మంది నిందితులలో 8 మందిని అరెస్టు చేసినట్లు, కరీంనగర్‌ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీ, బైకును వారి నుంచి స్వాధీనం చేసుకునట్లు తెలి పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.  సమావేశంలో భువనగిరి రూరల్‌ సీఐ అర్జునయ్య, ఎస్‌ఐ కె. వెంకటేష్‌ పాల్గొన్నారు.  
3

మరిన్ని వార్తలు