హత్య కేసులో ఎనిమిది మంది రిమాండ్

11 Dec, 2016 03:50 IST|Sakshi

అర్వపల్లి :చేతబడి నెపంతో పలువుర గ్రామస్తులు ఏకమై ఓ ఇంటిపై దాడికి పాల్పడి ఒకరిని హత్య చేసి, మరికొందరిని గాయపర్చిన కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన ఘటన శనివారం అర్వపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. తుంగతుర్తి సీఐ దండి లక్ష్మణ్, అర్వపల్లి ఎస్‌సై మోహన్‌రెడ్డిలు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఆవాసం తుంగగూడెంలో ఈ నెల 6న రాత్రి కొంతమంది గ్రామస్తులు అదే గ్రా మానికి చెందిన చిలుకూరి సోమయ్య ఇంటిపై దాడి చేసి సోమయ్యను హత్య చేసి ఆయన భార్య భారతమ్మ, కుమారుడు రమేష్‌లను తీవ్రంగా గాయపర్చారు. కేసుకు సంబంధించి ఎనిమిది మంది నింది తులను శుక్రవారం కోదాడ కోర్టులో హజరుపరిచారు.
 
  చేతబడి చేస్తూ తమ ను ప్రశాంతంగా బతకనివ్వడం లేద ని, ప్రతి ఇంట్లో ఏదో ఓ సమస్య, తర చూ అనారోగ్యం చోటుచేసుకోవడాని కి సోమయ్య చేతబడి చేయడమే కారణమని నిందితులు నర్సింగ సుమన్, తుంగ వెంకన్న, సైదుల లక్ష్మణ్, సైదుల నగేష్, డేగల శ్రవణ్, సైదుల సైదులు, దుబ్బాక నాగరాజు, వెన్నమళ్ల యాకయ్యలు తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిపై  కేసు నమోదు చేశామని, త్వరలోనే అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. అలాగే నిందితుల వద్ద నుంచి రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు, ఏడు కర్రలు,  ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో హెడ్‌కానిస్టేబుళ్లు వెంకట్‌రాములు, వీరన్న, వెంకన్న, రవీందర్, రత్నం, సిబ్బంది రాజు, సైదులు, సుధాకర్, అఖిల్, పురుషోత్తం, నాగరాజు, సైదులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు