మల్లారెడ్డి ఆస్తులెంతో చెప్పండి: ఈసీ

20 Aug, 2015 23:01 IST|Sakshi

రంగారెడ్డి: మల్కాజగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డికి సంబంధించిన ఎన్నికల ఆఫిడవిట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఆస్తుల వివరాలను ఆఫిడవిట్‌లో పొందుపరచలేదని ఒకరు చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఎలక్షన్ కమిషన్ దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికీ ఆ భూములు ఎంపీ పేరిట రికార్డుల్లో కొనసాగుతున్నాయని, ఈ ఆస్తులను ఆఫిడవిట్‌లో చూపలేదని ఎన్నికల సమయంలోనే ఈసీకి ఫిర్యాదు అందింది.

ఈ క్రమంలోనే సదరు ఎంపీ వివరణను నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనెల 25లోపు దీనిపై నివేదిక పంపాలని గడువు నిర్ధేశించిన నేపథ్యంలో మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఫిర్యాదుదారు పేర్కొన్న భూములను ఎప్పుడో ఆమ్మేశానని, భూమి కొన్న వ్యక్తి పహాణీల్లో పేరు నమోదు చే సుకోకపోతే తమ తప్పేలా అవుతుందని ఎంపీ వర్గీయులు అంటున్నారు. ఈ భూమి అమ్మకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాపీని త్వరలోనే సమర్పిస్తామని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు