ఏలేరు ఆధునికీకరణ సకాలంలో పూర్తిచేయాలి

6 Oct, 2016 21:34 IST|Sakshi
  • ఉభయ గోదావరి జిల్లాల చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.హరిబాబు
  • కిర్లంపూడి :
    ఏలేరు కాలువ ఆధునికీకరణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఉభయ గోదావరి జిల్లాల చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.హరిబాబు అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ముక్కొల్లు, భూపాలపట్నం, రాజుపాలెం గ్రామాల్లో ఏలేరు కాలువను ఆయన పరిశీలించారు. ఏలేరు ఆధునికీకరణలో భాగంగా కాలువను ఆనుకుని ఉన్న గ్రామాలకు నష్టం వాటిల్లకుండా డిజైన్‌ మార్పు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ముక్కొల్లు గ్రామంలో కాలువకు ఇరు పక్కలా సిమెంటు గోడలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఆయన వెంట ఎస్‌ఈ రాంబాబు, ఈఈ జగదీశ్వరరావు, డీఈ కృష్ణారావు, ఇతర ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు. 
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు