జర్నలిజం కోర్సుతో ఉపాధి అవకాశాలు

14 Aug, 2016 00:34 IST|Sakshi
కేయూ క్యాంపస్‌ : జర్నలి జం కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ మేరకు సమాజంలో జరిగే విషయాలపై అవగాహన, భాషపై పట్టు సాధిస్తే భవి ష్యత్‌లో వృత్తిలో రాణించవచ్చని కేయూ దూరవిద్యా కేంద్రం జర్నలిజం విభా గం విభాగాధిపతి డాక్టర్‌ సంగాని మల్లేశ్వర్‌ అన్నారు. దూరవిద్యా కేంద్రంలోని జర్నలిజం విద్యార్థుల ఫీల్డ్‌ విజిట్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా, ఫీల్డ్‌విజిట్‌లో భాగంగా విద్యార్థులు ఆకాశవాణి వరంగల్‌ కేంద్రంను సందర్శించగా పనితీరు, రేడియో కేంద్రాల్లో ఉద్యోగావకాశాల వివరాలను ఆకాశవాణి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చల్లా జైపాల్‌రెడ్డి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ సూర్యప్రకాశ్, ప్రోగ్రాం అనౌన్సర్‌ డాక్టర్‌ వి.వీరాచారి, గాదె మోహన్‌ తెలిపారు. జర్నలిజం విభాగం అధ్యాపకులు కె.నర్సిం హారాములు, డి.రామాచారి, సుంకరనేని నర్సయ్య, డి.శ్రీకాంత్, పులి శరత్, వం గాల సుధాకర్, పి.పద్మ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు