హస్తకళలను ప్రోత్సహించాలి

26 Aug, 2016 23:06 IST|Sakshi
మంకమ్మతోట : హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా అదనపు జేసీ డాక్టర్‌ నాగేంద్ర అన్నారు. నగరంలోని శ్రీరాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ఏజేసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హస్తకళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కళాకారులకు శిక్షణ ఇస్తోందన్నారు. అంతరించిపోతున్న వివిధ కళలను ప్రభుత్వం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల మంది హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను గోల్కోండ హస్తకళా విక్రయశాలలు, ఎక్స్‌పోలు, క్రాఫ్ట్‌ బజార్‌తోపాటు ఇతర ప్రదర్శనతో మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. కరీంన గర్‌లో శుక్రవారం నుంచి వచ్చే నెల 4 వరకు 70 మంది హస్త కళాకారులు ప్రదర్శన నిర్వహిస్తారని వెల్లడించారు. సూపర్‌వైజర్‌ మల్లికార్జున్‌ మాట్లాడుతూ  ప్రదర్శనలో చేతివృత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.  సిల్వర్‌ ఫిలిగ్రీ, హైదరాబాద్‌ ముత్యాల నగలు, బంజారా ఎంబ్రాయిడరీ వస్త్రాలు, కళంకార కాటన్‌ డరీస్, చేర్యాల పెయింటింగ్స్, నిర్మల్‌ కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్, అద్దకం చేనేత వస్త్రాలు, బెంగాల్‌ కాటన్‌ చీరలు, వెంకటగిరి, మంగళగిరి, కశ్మీర్, గద్వాల్‌ సిద్దిపేట కాటన్‌ చీరలు, చీరాల డ్రెస్‌ మేటీరియల్‌తో పాటు కాటన్‌ షర్టులు, బెడ్‌షీట్స్, కీ చైన్స్, లెదర్‌ పర్సులు నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు