మన్యంలో... ఎన్‌కౌంటర్‌ కలకలం

24 Oct, 2016 23:34 IST|Sakshi
  • కాల్పుల్లో జిల్లావాసి కామేశ్వరి మృతి...
  • ప్రజాప్రతినిధులు, అధికారులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని ఆదేశాలు
  • రంపచోడవరం : 
    మావోయిస్టు కార్యకలాపాలకు కీలక కేంద్ర బిందువైన ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ)లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో తూర్పు మన్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకుంది. ఈ కాల్పుల్లో జిల్లాకు చెందిన జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన కామేశ్వరి అనే మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఈమె భర్త ఆర్టీసీలో పనిచేసేవారు. ఏజెన్సీ  ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలి పెడుతున్నారు. ఏజెన్సీ లోతట్టు ప్రాంతాలకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వెళ్ళవద్దంటూ మౌఖిక ఆదేశాలను పోలీసు అధికారులు జారీ చేశారు. తాజా సంఘటన నేపధ్యంలో విశాఖ, తూర్పు సరిహద్దు ప్రాంతంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లను అప్రమత్తం చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయా స్టేషన్లలో బలగాలను పెంచి అప్రమత్తమయ్యారు. మావో ప్రభావిత ప్రాంతమైన విలీన మండలాల్లో గట్టి బందోబస్తును ఏర్పటు చేశారు. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.గత రెండేళ్లుగా ఉన్న ప్రశాంతత ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది. గూడేల్లోనుంచి గిరిజనులు సోమవారం బయటకు రావడానికే భయపడ్డారు. పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.
     
మరిన్ని వార్తలు