నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం

19 Nov, 2016 00:16 IST|Sakshi
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌
 
కర్నూలు(అగ్రికల్చర్‌): నగదు రహిత లావాదేవీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. జన్‌ధన్‌ ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బులు జమ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్లర్లకు సూచించారు.   శుక్రవారం కాన్ఫరెన్స్‌ హాల్‌లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... నగదు కొరతను అధిగమించేందుకు శనివారం నుంచి క్యాష్‌ ఎట్‌ మిషన్‌లతో మొబైల్‌ ఏటీఏంలను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కిరాణం షాపులు, మెడికల్‌ షాపులు, చౌకధరల దుకాణాలు తదితర వాటిల్లో క్యాష్‌ ఎట్‌ మిషన్‌లను ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు.   ఎస్‌బీఐ ఆర్‌ఎం రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ... తమ బ్యాంకులో రూ.25వేల నుంచి రూ50వేల డిపాజిట్‌తోమ కర ంట్‌ఖాతా ప్రారంభిస్తే వారికి క్యాష్‌ ఎట్‌ మిషన్‌లు ఇస్తామని వివరించారు. ఆంధ్రబ్యాంకులో రూ.3000 జమ చేస్తే వీటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీఎం గోపాలకృష్ణ తెలిపారు. మండలానికి నలుగురు, మేజర్‌ పంచాయతీకి ఇద్దరు, మైనర్‌ పంచాయతీకి ఒకరు ప్రకారం బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎల్‌డీఎం నరసింహారావు, అన్ని బ్యాంకుల రీజినల్‌ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
మొబైల్‌ ఏటీఎంలు ప్రారంభం
 నగదు కొరతను తీర్చేందుకు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమొహన్‌ మొబైల్‌ ఏటీఎంలను ప్రారంభించారు. వీటి ద్వారా రూ.2000 నగదు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతానికి మూడు మొబైల్‌ ఎటీఎంలను అందుబాటులోకి తెచ్చామని శనివారం నుంచి నగరంలో అందుబాటులో ఉంటాయని వివరించారు. 
మరిన్ని వార్తలు