వృత్తి పనివారిని ప్రోత్సహించండి

7 Jan, 2017 23:35 IST|Sakshi
వృత్తి పనివారిని ప్రోత్సహించండి
- బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు ఇవ్వండి
- ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రికి ఎంపీ బుట్టా రేణుక లేఖ
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జనాభాలో 70 శాతంగా ఉంటున్న బీసీ, ఓబీసీలకు న్యాయం చేసేందుకు వీలుగా చేతివృత్తులు, కులవృత్తులను ప్రోత్సహించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జెట్లీకి లేఖ రాశారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, చేనేత, మత్స్యకారులు, గొర్రెల పెంపకం వంటి కులవృత్తులతో పాటు హస్తకళలు, వ్యవసాయ అనుబంధ వృత్తులు నిర్వహించుకునేందుకు కనీస పెట్టుబడి, మార్కెటింగ్‌కు డబ్బు అవసరమన్నారు. ఆ మేరకు స్థోమత లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, బడ్జెట్‌ (2017-18)లో ఎక్కువ మొత్తాలు కేటాయించి ప్రోత్సహించాలని లేఖలో పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు