ముగిసిన జిల్లా స్థాయి క్యారమ్స్‌ పోటీలు

30 Aug, 2016 00:45 IST|Sakshi

దేవరకొండ
దేవరకొండలో ఈ నెల 27న ప్రారంభమైన జిల్లా స్థాయి క్యారమ్స్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి యూసూఫ్, షరీఫ్, శ్యామ్సన్‌లు గెలుపొందగా, రెండవ బహుమతి ఇలియాస్, ముజీబ్‌లు కైవసం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షటిల్‌ ఇండోర్‌ స్టేడియానికి స్థలాన్ని కేటాయించేందుకు కషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కష్ణకిషోర్, తాళ్ళ సురేష్, చంద్రయ్య, భాస్కర్, బాబా, కష్ణమూర్తి, నర్సింహ్మ, ఐజాక్, రమేష్, వరికుప్పల సురేష్, శేఖర్, గిరి ఉన్నారు.
 

మరిన్ని వార్తలు