నూకపల్లి హౌసింగ్‌బోర్డు అక్రమాలపై విచారణ

22 Aug, 2016 23:06 IST|Sakshi
  • బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణ
  • జగిత్యాల రూరల్‌: నూకలపల్లి హౌసింగ్‌ బోర్డు అక్రమాలపై విచారణ పూర్తయింది. కొందరు బ్రోకర్లు కన్నువేసి హౌసింగ్‌ శాఖ డీఈతో చేతులు కలిపి డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పట్టాలు మార్పిడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదు అందుకున్న సబ్‌ కలెక్టర్‌ విచారణకు  అదేశించారు. గతంలో పనిచేసిన ఓ హౌసింగ్‌ డీఈ సుమారు 350 మందికి  పట్టాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. మూడురోజులుగా విచారణ నిర్వహించిన అధికారులు అక్రమ పట్టాలు పొందిన వారినుంచి ఎంత డబ్బు వసూలు చేశారనే దానిపై వివరాలు సేకరించారు. దీనిపై నివేదిక సమర్పించి ఉన్నతాధికారులు సమర్పించారు. ఇదివరకు పనిచేసిన హౌసింగ్‌ శాఖ డీఈతోపాటు మల్యాలకు చెందిన సింగాపూర్‌ మల్లయ్య, రాజారం గ్రామానికి చెందిన నర్సయ్య, నూకపల్లికి చెందిన మరోవ్యక్తి ద్వారా పట్టాల మార్పిడి, డబ్బులు చేతులు మారినట్లు విచారణలో తేలింది. వారిపై చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుని సబ్‌కలెక్టర్‌కు సమర్పించారు. 
     
     
     
మరిన్ని వార్తలు