ఐటీడీఏ పనులపై ఆరా

29 Sep, 2016 23:22 IST|Sakshi
ఐటీడీఏ పనులపై ఆరా
విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు 
 పార్వతీపురం : ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖ చేపట్టిన పనులపై  విజిలెన్స్‌ అధికారులు మూడు రోజులుగా విచారణ చేపడుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం కార్యాలయానికి  వచ్చిన విజిలెన్స్‌ అధికారులు సంబంధిత అధికారులను కలిసి రికార్డులు, సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌లో సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను పిలిపించి విచారణ చేపట్టారు. సాయంత్రం వైకెఎం కాలనీలోని వైటిసీ భవనంతో పాటు నిర్వాసితుల కాలనీలలో చేపట్టిన ఆర్‌అండ్‌ఆర్‌ పనులను పరిశీలించారు. అలాగే బుధ, గురువారాలలో స్థానిక కలెక్టర్‌ క్యాంపు హౌస్‌లో ఉదయం సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను విచారించి, రికార్డులను పరిశీలించారు.  అనంతరం  క్షేత్ర పరిశీలన చేశారు. దీనిలో భాగంగా ఐటీడీఏ పరిధిలో జరిగిన వైటీసీ భవనాల నిర్మాణం, రోడ్లు, ఇతర భవనాల నిర్మాణ పనులపై ఆరాతీశారు.  ఈ సందర్భంగా కార్యాలయంలోని ఈఈ, డీఈఈలతో పాటు డ్రాయింగ్‌ బ్రాంచ్‌కు చెందిన ఇద్దరు అధికారులను కూడా విచారించారు.  
 
 
 ఫిర్యాదుల మేరకే...
ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖ చేపట్టిన వైటిసీ భవనాల నిర్మాణం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విజెలెన్స్‌ ఎస్పీ ప్రేమ్‌బాబు ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు విజెలెన్స్‌ డీఎస్పీ విద్యాసాగర్‌ తెలిపారు. దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.  
 
ఫోటో రైటప్‌29పీపీఎం26ఎ:  మాట్లాడుతున్న విజిలెన్స్‌ డీఈఈ విద్యాసాగర్‌
 
మరిన్ని వార్తలు