పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

7 Aug, 2016 19:28 IST|Sakshi
చెన్నవెల్లిలో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి
బాలానగర్‌ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చెన్నవెల్లిలో మొక్కలునాటారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 33 శాతం ఉండాల్సిన అడవులు 16 శాతమే ఉన్నాయని వనాల మూలంగానే వర్షాలు సమద్ధిగా కురుస్తాయని దానికోసం సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారని అన్నారు. చెన్నవెల్లి గ్రామానికి ఇచ్చిన 40వేల మొక్కలు నాటి టార్గెట్‌ పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఈగలు దోమలు ఉండవని అన్నారు. ఇళ్ల నుంచి నీటిని బయటికి వదలడంతో ఎక్కడపడితే అక్కడనీరు చేరి వాటిపై దోమలు చేరి రోగాలబారిన పడాల్సి వస్తోందని వేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌చారి, మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రామ్‌రెడ్డి, చెన్నయ్య, పెంటయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు