ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత

14 Aug, 2016 23:51 IST|Sakshi
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత
 
  •  జేసీ–2 రాజ్‌కుమార్‌
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) :
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత అని జేసీ–2 ఆర్‌.సాల్మన్‌రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న చర్చావేదికలో భాగంగా ఆదివారం వనం – మనం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడడం భావితరాలకు సంపదను ఇవ్వడమేనని తెలిపారు. స్వచ్ఛంద సేవాసంస్థల అధ్యక్షుడు ఈవీఎస్‌ నాయుడు మాట్లాడుతూ విచ్చలవిడిగా చెట్లను నరికివేయడంవల్ల కాలుష్యం అధికమవుతుందన్నారు. కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. యానాదిసంఘం అధ్యక్షురాలు మల్లికా శైలజ మాట్లాడుతూ ప్రకృతి స్వచ్ఛతకు చిహ్నమన్నారు. ప్రకృతి ఫలాలను అనుభవించాలేగానీ ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నించకూడదని తెలిపారు. డీఎఫ్‌ఓ ఎం.చాణిక్యరాజు మాట్లాడుతూ జిల్లాలో కోటికిపైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వెంకటగిరి డీఎఫ్‌ఓ రవీంద్రరెడ్డి, తెలుగుగంగ డీఎఫ్‌ఓ హుస్సేనీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు