పాస్ కాకున్నా.. ప్రమోషన్‌కు అర్హులే

20 Oct, 2015 06:59 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: సర్వే ట్రైనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోయినా 45 సంవత్సరాల వయసు దాటితే రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోయినా 45 ఏళ్ల వయసు దాటిన తర్వాత పదోన్నతి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ  మినహాయింపు ఇస్తూ 1999లో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే సాంకేతిక పరీక్షలకు ఈ మినహాయింపు వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు