విచిత్ర ప్రకృతి

19 May, 2017 02:10 IST|Sakshi
విచిత్ర ప్రకృతి

పగలు తీక్షణమైన వడగాడ్పులు
సాయంత్రం భీకర గాలులు, పిడుగుల వాన
పిడుగుపాటుకు ఒకరు మృతి
నేలకొరిగిన భారీ వక్షాలు
వర్షపాతం స్వల్పమే


తిరుపతి తుడా: వారం రోజులుగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తిరుపతి,          ఐరాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. విపత్తు నిర్వహణశాఖ ముందస్తు హెచ్చరికలు పనిచేశాయి. గురువారం సాయంత్రం జిల్లాలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. వీరి అంచనాకు తగ్గట్లుగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో తరుముకొచ్చిన వర్షం అంతేవేగంగా వెళ్లిపోయింది. తిరుపతి తుడారోడ్డు ఒక విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ షార్టుసర్క్యూట్‌తో కాలిపోయింది. అనేక ప్రాంతాల్లో గాలి, ఉరుములు మెరుపుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం జిల్లాలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు     జీడీనెల్లూరు నియోజకవర్గంలో గాలుల వల్ల మామిడి కాయలు నేలరాలిపోయాయి. పిడుగుల ధాటికి జనం హడలిపోయారు. వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగులో పిడుగుపాటు ఒక ఆవు మృతి చెందింది. ఒక పూరిగుడిసె దగ్ధమయింది.
   
తిరుమలలోనూ భారీ వర్షం కురిసింది.

ఐరాల మండలం వైఎస్‌గేటు, ఐరాల, నాంపల్లె, చంద్రయ్యగారిపల్లె, పొలకల, నాగవాండ్ల పల్లె, 35 యల్లంపల్లె పంచాయతీల పరిధిలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. నాంపల్లెలో పిడుగు పాటుతో ఆంజనేయుల నాయుడు అనే వ్యక్తి (52) మృతి చెందాడు.

తొట్టంబేడు మండలం కొణతనేరిలో పిడుగుపాటుకు గడ్డివామి కాలిపోయింది. తంగేళ్లపాళెం వద్ద విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పడిపోయింది. బసవయ్యపాళెంలో విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. కాసరం, చిట్టత్తూరు, చొడవరం, చియ్యవరం తదితర గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి.

  రామకుప్పం మండలంలో ఈదురు గాలుల తాకిడికి ఇండ్ల పైకప్పులు ధ్వంసం కాగా ఓ విద్యుత్‌ స్తంభం విరిగిపడింది. అరటి, టమాట, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కొటారుగడ్డలో విద్యుత్‌ స్తంభం విరిగి పడింది. మామిడి తోటల్లో మామిడి కాయలు ఎక్కువగా నేల రాలింది.

శ్రీకాళహస్తిలోని పానగల్, ఏపీసీడ్స్, వ్యవసాయ మార్కెట్‌కమిటీ, ముత్యాలమ్మగుడి వీధి, భాస్కరపేట, రాజీవ్‌నగర్‌ ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోయాయి. పలు విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి.
 

మరిన్ని వార్తలు