సత్తా చూపుతా.. సాయం చేయరూ!

15 Jun, 2017 23:09 IST|Sakshi
సత్తా చూపుతా.. సాయం చేయరూ!
విలువిద్యలో ప్రావీణ్యం ఉంది ప్రోత్సహించండి
ఎవరెస్ట్‌ అధిరోహకుడు కుంజా దుర్గారావు 
వీఆర్‌పురం : తనకు తగిన ప్రోత్సాహం అందిస్తే విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపిస్తానని ఎవరెస్ట్‌ అధిరోహకుడు కుంజా దుర్గారావు అన్నాడు. రేఖపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం 
దుర్గారావు మాట్లాడుతూ విలువిద్యలో తనకు ప్రావీణ్యం ఉందని, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో, ఒలింపిక్స్‌లో  పాల్గొనేందుకు తగిన సాధన చేయాల్సి ఉందన్నాడు. సాధనకు అవసరమైన పరికరాలకు సుమారు రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపాడు. ప్రభుత్వంగానీ, దాతలు గానీ తన ఆశయ సాధనకు ఆర్థిక సహకారం అందించాలని కోరాడు. అనంతరం తహసీల్దార్‌ జీవీఎస్‌ ప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చాడు. దుర్గారావును   తహసీల్దార్‌ అభినందించారు. దుర్గారావు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పూనెం సత్యనారాయణ, సోయం చినబాబు తదితరులు ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు