ప్రతీ మొక్కను బతికించాలి..

4 Jul, 2017 03:09 IST|Sakshi
ప్రతీ మొక్కను బతికించాలి..

►  పక్కా ప్రణాళికతో హరితహారం
► మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
► గతానుభవాలు పునరావృతం కాకూడదు
►  50 శాతం బతికితే మొక్కకు  5 రూపాయలు
► నిధుల విషయంలో రాజీలేదు..
► అటవీశాఖదే పెద్దన్న పాత్ర
►  12న లక్ష మొక్కలతో  హరితహారం ప్రారంభం
► అధికారులతో సమీక్షించిన మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్‌


రెండేళ్లలో పట్టణాల్లో మినహా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 శాతం మొక్కలు బతికాయి.. అందుకే ముఖ్యమంత్రి పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మండలస్థాయిలోనూ మొక్కల లెక్కలు పక్కాగా రావడం లేదు. పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పక్కా ప్రణాళికలు రూపొందించుకుని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి. మొక్కలు నాటడమే కాకుండా వాటి ని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలి. – జోగురామన్న, అటవీశాఖ మంత్రి

గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలి. ఈ ఏడాది వంద శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలి. జిల్లాలో ఎన్ని మొక్కలు పెట్టామని కాదు.. ఎన్ని బతికాయన్నదే ముఖ్యం. మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సంఖ్య కో సం, ఫొటోలకు ఫోజుల కోసం కాకుండా మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే అంతా సిద్ధం కావాలి.  – ఈటల రాజేందర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి

సాక్షి, కరీంనగర్‌/కరీంనగర్‌సిటీ: ముఖ్యమంత్రి మానసపుత్రికగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో  విజ యవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. సో మవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మూడో విడత హరితహారం అమలుపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొక్కల నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 12న కరీంనగర్‌కు రానున్నట్లు వెల్లడించారు.

ఆ రోజు కరీంనగర్‌ పట్టణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంతో హరితహారాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో మూడో విడతగా 1.10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతోపాటు కరీంనగర్‌ పట్టణంలో లక్ష మొక్కలు నాటే ప్రణాళికలు, పనుల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెం డేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొదటి సంవత్సరంలో 16 కోట్లు, రెండో సం వత్సరంలో 32 కోట్లు మొక్కలు నాటామని తెలిపారు. అందులో 67 శాతమే రక్షించుకున్నామని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడో విడత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని తెలిపా రు.

పాఠశాలలో మొక్కల నిర్వహణకు ఉపాధిహామీ నిధులిస్తామని స్పష్టం చేసినప్పటికీ విద్యాశాఖ విని యోగించడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో మొక్కల నిర్వహణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రతీ శాఖ ద్వారా నాటే మొక్కల నిర్వహణకు నిధులున్నాయని తెలిపారు. మండల స్థాయి నుంచే మొక్కల లెక్కలు పక్కాగా తెలియడం లేదని, అది పునరావృతం కాకుండా సమగ్ర నివేదికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్ని ఇళ్లున్నాయి? ఎన్ని కిలోమీటర్ల రోడ్లు? సంస్థలు? అందులో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు? గతంలో తీసుకున్నదెంత? ఇప్పుడెంత? అనే సమగ్ర వివరాలతో ముందుకుపోవాలన్నారు. ఎంపీడీవోలు మండలస్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఆమ్లెట్‌ గ్రామాలకు కూడా హరితరక్షణ కమిటీ బాధ్యతలు అప్పగించాలన్నారు. రోడ్డు వెడల్పు, పైపులైన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి పనులు పూర్తయిన రోడ్ల వద్దనే మొక్కలు నాటాలన్నారు. పట్టణాల్లో కూడా హరితరక్షణ కమిటీలను బలోపేతం చేస్తున్నామని, అందుకు తగిన నిధులను, నీటి వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు ఆకుపచ్చని పరిసరాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాటిన మొక్కల రక్షణకు నిధుల కొరత లేదని, మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. 

మండలస్థాయిలోనే ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మొక్కలు బతికితే ఉపాధిహామీ కింద ప్రతీ మొక్కకు నెలకు రూ.5 చొప్పున అందజేస్తామన్నారు. జిల్లాలో గుట్టలు, ప్రభుత్వ స్థలంలో నీటి కోసం బోర్లతో నీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తామన్నారు. హరితహారంలో అటవీశాఖ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటితే 100 కోట్ల మొక్కలు అటవీశాఖ ద్వారా నాటామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

హరితహారం ప్రతిష్టాత్మకం..: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చే పట్టిందన్నారు. ఈ ఏడాది హరితహారం గొప్పగా ఉం టుందన్నారు. హరితహారానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని, నిధుల విషయంలో రాజీలేదని స్ప ష్టం చేశారు. ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి ప్రతి మొక్కనూ కాపాడుకునేలా ముందుకు పోవాలని సూచించారు. ఎల్‌ఎండీ డ్యాం, శ్మశానవాటికలు, రోడ్లు, దేవాలయాలు, ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల వద్ద విరివిగా మొక్కలు నాటవచ్చన్నారు. రెండేళ్ల క్రితమున్న భూములు ఇప్పుడూ ఉన్నాయన్నారు.

నగరంలోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలోని ఖాళీస్థలంలో ట్రీగార్డుల బదులు ట్రీగార్డుల బదులు ప్రహరీ నిర్మిస్తే కొన్ని వేల మొక్కలు బతికించే అవకాశముందని, అందుకు తగిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. లెక్కలే ఉన్నాయి గాని మొ క్కలు లేని అనుభవాలు ఎదురయ్యాయన్నారు. రెండేళ్లలో ఆశించినంత సాధించలేకపోయామన్నారు. గత ప్ర భుత్వాలకు భిన్నంగా సం క్షేమంతో పాటు హరితహారా న్ని ప్రాధాన్యతగా తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. నిరంతర సమీక్షలతో బాధ్యతాయుతంగా కృషి చేయాలని, కార్పొరేషన్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

నగర మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దుతామన్నా రు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌బాబు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధి కారుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హ రితహారం విజయవంతం కావాలన్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే ఝా, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మ ద్, నగర పాలక సంస్థ కమిషనర్‌ శశాంక, హరితహారం స్పెషలాఫీసర్‌ ఆంజనేయులు, ఏసీపీ జె.రామారావు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, డీఈవో రాజీవ్, డీపీవో నారాయణరావు, జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సరోజన, ఎక్సైజ్‌ ఈఎస్‌ శంకర య్య, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులున్నారు.

మరిన్ని వార్తలు