అడుగడుగునా ఆంక్షల కత్తి

21 Mar, 2017 01:59 IST|Sakshi
అడుగడుగునా ఆంక్షల కత్తి
భీమవరం: తుందుర్రు అంటే ఉలికి పడుతున్న ప్రభుత్వం.. ఆక్వా ఫుడ్‌పార్క్‌ పేరెత్తితే ఆగమేఘాలపై రంగంలోకి దిగుతున్న పోలీసులు.. అరెస్టులు, నిర్బంధాలు షరా మామూలైపోయాయి. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న కాలుష్య కారక గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా దాదాపు 40 గ్రామాల ప్రజల పోరాటం చేసూ్తనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌పార్క్‌ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసేలా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలిసి వినతిపత్రం అందించాలని సోమవారం అమరావతి వెళ్లిన సీపీఎం, పోరాట కమిటీ నాయకులను  పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. మరోసారి పో రాటంపై అక్కసు వెళ్లగక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుందుర్రులో  గోదావరి మెగా ఫుడ్‌పార్క్‌ వల్ల కలిగే అనర్థాలను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు వివరించేందుకు సీపీఎం నాయకులు వి.ఉమామహేశ్వరరా వు, జేఎన్‌వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు  ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ ముందుగా అసెంబ్లీ గేట్‌పాస్‌లు తీసుకున్నారు. దీనికిగాను సోమవారం అనుమతి లభించింది. గేట్‌పాస్‌తో పాటు వినతిపత్రాన్ని తీసుకుని బ యలుదేరిన వారిని అసెంబ్లీలోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదేమని ప్రశ్నించగా అసెంబ్లీలో ఎటువంటి వినతిపత్రాలు ఇవ్వడానికి అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. వినతిపత్రాన్ని మీకే ఇచ్చేస్తామని పాస్‌లు ఉన్నందును తమను లోనికి అనుమతించాలని సీపీఎం, పోరాట కమిటీ నాయకులు పోలీసులను కోరారు. అయినా వినిపించుకోకుండా పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారని గోపాలన్‌ చెప్పారు. సాయంత్రం ఐదు గంటల వరకు స్టేషన్‌లో నిర్బంధించి సొంత పూచీకత్తులతో విడుదల చేశారని తెలియజేశారు. అసెం బ్లీలో ప్రవేశించేందుకు పాస్‌లు ఇచ్చినా పోలీసులు వ్యవహించిన తీరు బాధాకరమని గోపాలన్‌  ఆవేదన వ్యక్తం చేశారు. తుందుర్రు అంటేనే ప్రభుత్వం ఉలికిపాటుకు గురవుతుందని వేలాదిమంది ఫుడ్‌పార్క్‌ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. అధికారికంగా పాస్‌లు పొందినా అనుమతించకపోవ డం చూస్తుంటే ప్రజలపై పాలకులకు ఉ న్న శ్రద్ధ తేటతెల్లమవుతోందని గోపాలన్‌ విమర్శించారు.
 
అక్రమ అరెస్ట్‌లపై నిరసన
 గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని నిలుపుదల చేయా లని కోరుతూ రాజధాని అమరావతి వెళ్లిన పోరాట కమిటీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పట్టణం లోని మెంటేవారితోటలోని సీపీఎం కా ర్యాలయం నుంచి ప్రదర్శనగా పోలీస్‌ బొమ్మ సెంటర్‌ మీదుగా ప్రకాశం చౌక్‌ కు చేరుకుని నిరసన తెలిపారు. సీపీఎం ఆక్వాఫుడ్‌ పార్కు వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాట కమిటీ, సీపీఎం నేతలు అసెంబ్లీ వద్దకు వెళ్లారని పట్టణ కార్యదర్శి బీవీ వర్మ అన్నారు. ఇందుకు ముందస్తు అనుమతులు తీసుకున్నా పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్‌ చేశారని విమర్శించారు. సమస్య వినేం దుకు పిలిచి అరెస్ట్‌ చేయించడం దారుణమన్నారు. నిరసనలో చేబోలు సత్యనారాయణ, ఎం.వైకుంఠరావు, చెల్లబో యిన వెంకటేశ్వరరావు, కె.అప్పన్న, ఎన్‌.రాము తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు