మాజీ డీఎస్పీ సీసీ సస్పెన్షన్‌

1 Sep, 2016 23:32 IST|Sakshi
 • ఆలస్యంగా వెలుగులోకి
 • కప్పి ఉంచిన అధికారులు
 • కరీంనగర్‌ క్రైం : కరీంనగర్‌ డీఎస్పీ సీసీగా పనిచేసిన అబ్దుల్‌ రజాక్‌ను సస్పెండ్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వైద్యుడిని తప్పిస్తానని పెద్ద మెుత్తం వసూలు చేసిన ఘటనలో మెుదటి బదిలీ చేసిన తర్వాత సస్పెన్షన్‌ వేటు వేశారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 2015, ఆగస్టులో వేర్వేరు వ్యక్తుల ఫిర్యాదుతో రెండు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న ఓ వైద్య విద్యార్థిని తప్పించేందుకు కొందరు ఆ సమయంలో కరీంనగర్‌ డీఎస్పీ సీసీగా పనిచేస్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ రజాక్‌ను సంప్రదించారు. వీరి నుంచి రజాక్‌ సుమారు రూ.3.4 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే వన్‌టౌన్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత రజాక్‌ వద్దకు వెళ్లి డబ్బులు తిరిగివ్వమనగా.. సరైన సమాధానం రాకపోవడంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఎస్పీ జోయల్‌డెవిస్‌ ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం రజాక్‌కు ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్‌ చేశారు. రోజు డబ్బులు తీసుకున్న విషయం రుజువు కావడంతో మరుసటి రోజు సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు యత్నించారు. గతంలోనూ కరీంనగర్‌ డీఎస్పీ రామారావు సీసీగా పనిచేసిన సమ్మయ్య సస్పెన్షన్‌కు గురికాగా ప్రస్తుతం అబ్దుల్‌ రజాక్‌పై వేటు పడడం గమనార్హం. 
   
   
   
   
మరిన్ని వార్తలు