‘పట్నం’కు ఎన్టీఆర్‌ ఎక్సలెన్సీ అవార్డు

25 May, 2017 22:58 IST|Sakshi

అనంతపురం కల్చరల్‌ : నగరానికి చెందిన ప్రసిద్ధ నాట్యాచార్యులు డాక్టర్‌  పట్నం శివప్రసాద్‌ ఎన్టీఆర్‌ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యారు.  నందమూరి లక్ష్మీపార్వతీ నేతృత్వంలో శిఖరం ఆర్ట్స్‌ అకాడమీ వారు  వివిధ రంగాల్లో విభిన్న కృషి చేస్తున్న వారికి అందించే పురస్కారాన్ని పట్నం ఈనెల 26న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే  పురస్కార మహోత్సవంలో అందుకోనున్నారు.  అదేవిధంగా ఆయన శిష్యబృందం రాష్ట్రస్థాయి సాంస్కృతిక సంబరాల్లో అనంత తరపున శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేస్తారు. 

మరిన్ని వార్తలు