ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

22 Jun, 2017 19:47 IST|Sakshi

- రూ.3 లక్షల డీడీ భాగోతంపై స్పందించిన ఉన్నతాధికారులు

అనంతపురం సెంట్రల్‌ : రూ.3 లక్షల డీడీ దొంగలించిన భాగోతంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అనంతపురం ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ రమణను సస్పెండ్‌ చేస్తూ సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 18(ఆదివారం)న ‘ఎక్సైజ్‌లో డీడీ కుంభకోణం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రధాన సూత్రధారి అయిన కానిస్టేబుల్‌ రమణను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

గత నెలలో మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో సదరు కానిస్టేబుల్‌ కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వం పేరుతో ఒకరు కట్టిన డీడీని తస్కరించి దానిని మరొకరికి ఇచ్చి సొమ్ము చేసుకున్నాడు. లోగుట్టు బయటపడదులే అనుకున్నాడు. కానీ బాధితుడు ఈ విషయాన్ని పసిగట్టడంతో కొందరు అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో కలవరపాటుకు గురై కానిస్టేబుల్‌ రమణపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

మరిన్ని వార్తలు