నిపుణుల అధ్యయనం

13 Jan, 2017 01:14 IST|Sakshi
నిపుణుల అధ్యయనం

తిరుమల:తిరుమల శ్రీవారి ఆలయ క్యూలలో మార్పులు, చేర్పులపై గురువారం నిపుణులు క్షేత్ర స్థాయిలో  అధ్యయనం చేశారు. టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు,  ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ, చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖరరెడ్డి  వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి ఆలయానికి అనుసంధానమైన  ∙కదిలే వంతెనను పరిశీలించారు. ఆలయంలో వెండి వాకిలి వద్ద అన్నప్రసాదాల వితరణ కోసం క్యూలను పరిశీలించారు.

నిపుణుల సూచనలను అమలు చేస్తాం
అలిపిరి మార్గం నుంచి తిరుమలకు వచ్చే కాలిబాట అన్నమయ్య మార్గంతోపాటు ఆలయంలో క్యూల నిర్వహణపై ఐఐటీ నిపుణుల సూచనలను అమలు చేస్తామని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు తెలిపారు. భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణ లక్ష్యంతోనే పనులు కొనసాగిస్తామన్నారు.

అధ్యయనం చేసి నివేదిక ఇస్తాం
పురాతన అన్నమయ్య మార్గంతోపాటు  శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూల ఆ«ధునికీకరణపై అధ్యయనంచేసి నివేదిక ఇస్తామని ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఉన్నవాటిలో మార్పులు చేర్పులు చేయాలా? కొత్తవి నిర్మించాలా? అన్నవాటిపై సమగ్రంగా సూచనలిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు