అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ..

16 Jul, 2016 09:30 IST|Sakshi
అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ..

విజయవాడ: ఫేస్‌బుక్‌లో నకిలీ ఎకౌంట్‌తో చాటింగ్ చేసి ఓ యువకుడి మృతికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి పేరుతో ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడకు చెందిన నాగభూషణం, అనుశ్రీ అనే పేరుతో ఫేస్‌బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ప్రేమ పేరుతో పలువురిని మోసం చేశాడు. రెండు తెలుగు రాష్ట్రల పరిధిలో ఇతని బారిన పడినవారి సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుశ్రీ ప్రేమ మాయలో పడి కడప జిల్లా ఖాజీపేటకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తి గత నెల 29న ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేమిస్తున్నానని నమ్మించి వరప్రసాద్ నుంచి సుమారు రూ.4 లక్షలు తీసుకున్నాడు నాగభూషణం అలియాస్ అనుశ్రీ. అయితే అనుశ్రీది  ఫేక్ అకౌంట్ అని అకౌంట్ యూజర్ యువతి కాదని తెలియడంతో వరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో చేపట్టి శుక్రవారం నాగభూషనాన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇతని బారినపడి 57 మంది మోసపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని వార్తలు