మూఢనమ్మకాలను పారదోలాలి

18 Sep, 2016 00:45 IST|Sakshi
మూఢనమ్మకాలను పారదోలాలి

చౌటుప్పల్‌ : శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా నేటికీ మూఢ నమ్మకాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.రమేష్‌ అన్నారు. మండలంలోని లక్కారం మోడల్‌ స్కూల్‌లో శనివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్‌ ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చన్నారు. నేటి యువత శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించకుండా, మూఢనమ్మకాలను విశ్వస్తుందని పేర్కొన్నారు. ప్రశ్నించడం, పరిశోధించడం, విశ్లేషించడం ద్వారా ప్రతి విషయాన్ని సైన్స్‌ ద్వారా ఋజువు చేయవచ్చన్నారు. నిరక్ష్యరాస్యుల్లోని మూఢనమ్మకాలను పారదోలాల్సిన బాధ్యత అక్ష్యరాస్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ దీపాజోషి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్‌ అవ్వారు గోవర్థన్, జిల్లా అధ్యక్షుడు ఎన్‌.వెంకటరమణారెడ్డి, రత్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు