రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం

26 Nov, 2016 23:41 IST|Sakshi

ఓబుళదేవరచెరువు : ఓబుళదేవరచెరువు - గోరంట్ల మార్గంలోని రామయ్యపేట సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి (55) అనే రైతు దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. ఓబుళదేవరచెరువులో పని ముగించుకని సూపర్‌ ఎక్సెల్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. మరి కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంనేలోపే  విపరీతమైన వేగంతో దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య అంజినమ్మ, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు శివశంకర్‌రెడ్డి ఉన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు