రైతు సంక్షేమమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యం

25 Mar, 2017 23:23 IST|Sakshi
రైతు సంక్షేమమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యం
 అసిస్టెంట్‌ డైరెక్టర్‌  సత్యనారాయణ చౌదరి
మార్కెట్‌యార్డులో రైతు సంజీవిని ఆసుపత్రి ప్రారంభం
 కర్నూలు(వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): రైతుల సంక్షేమమే వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ లక్ష్యమని ఆ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌  సత్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. యార్డుకొచ్చే ప్రతి రైతుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దిగుబడులు   విక్రయించేందుకు యార్డుకు వచ్చిన  రైతులకు వైద్యసేవలు అందించడం కోసం  స్థానికంగా  రైతు సంజీవి పేరుతో ఉచిత వైద్య ఆసుపత్రి ఏర్పాటు చేశారు. దీన్ని శనివారం కృష్ణాపురానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
 
అనంతరం యార్డు ప్రత్యేక కార్యదర్శి శివరామక​ృష్ణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఏడీఎం మాట్లాడుతూ యార్డులో ఆహ్లాదాన్ని అందించే విధంగా పచ్చని మొక్కలను నాటే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ యార్డుకొచ్చే రైతులకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ప్రాథమిక వైద్యం అందించేందుకు ఈ వైద్యశాల దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో యార్డు సహాయ కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, శివప్ప, సూపర్‌వైజర్లు రెహమాన్, ఈశ్వర్‌రెడ్డి, రామదాసు, రిటైర్డ్‌ జేడీ నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
300 మంది రైతులకు ఉచిత వైద్యపరీక్షలు:
రైతు సంజీవిని వైద్యశాలలో ప్రారంభోత్సవ రోజున డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి  300 మంది రైతులను పరీక్షించారు.   బీపీ, షుగర్‌తో పాటు పలు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశౠరు. 
 
స్వచ్ఛమార్కెట్‌ :
ఏడీఎం సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో శనివారం యార్డులో స్వచ్ఛమార్కెట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మొత్తం యార్డు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌