ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

20 Jul, 2016 17:22 IST|Sakshi
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

కోదాడఅర్బన్‌: రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడిని అరికట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వామపక్ష విద్యార్ధి సంఘాలైన  ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా కార్పొరేట్‌ విద్యాసంస్థలను బహిష్కరించాలని కోరుతూ ఈనెల 23న  వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. బుధవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో వారు దీక్ష  పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఫీజుల నియంత్రణకై రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 42ను అమలు చేయాలన్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రా కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చేపూరి కొండలు, పి.శ్రీనివాస్, ఎస్‌.బిక్షం, నరేష్, చందర్‌రావు, రాజు, వీరనాయక్, శ్రీకాంత్, శ్రీనునాయక్, వీరబాబు, నవీన్, సాయి, పవన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు