వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం

29 Jul, 2016 00:35 IST|Sakshi
వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం

వన్‌టౌన్‌ : కొత్తపేట ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ఆyì lకృత్తిక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆషాడ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున స్వామికి ఇష్టమైన కావడిని సమర్పించిన వారి కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని తొలుత భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి.. అనంతరం పాలు, పన్నీరు, విబూది వంటి వివిధ రకాల కావళ్లను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. మేళతాళాలు, భక్తుల నామస్మరణ మధ్య ఈ ప్రదర్శన వన్‌టౌన్‌ వీధుల మీదుగా సాగింది. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల శ్రీనివాస్‌ పర్యవేక్షించారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు