బాలాంత్రపు రజనీ కాంతారావుకు సన్మానం

12 Dec, 2016 15:03 IST|Sakshi
పాత గుంటూరు: కవిగా, కళాకారుడిగా, సంగీత విద్వాంసుడిగా, గాయకుడిగా ఖ్యాతిగాంచిన బాలాంత్రపు రజనీ కాంతారావు శతాబ్దిక మేరుపర్వతం లాంటివారని ప్రముఖ సాహిత్య విశ్లేషకులు వాడ్రేవు చిన వీరభధ్రుడు పేర్కొన్నారు. నగరంపాలెంలోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి వసతిగృహం ప్రాంగణంలో ప్రముఖ సంగీత కళానిధి బాలాంత్రపు రజనీ కాంతారావుకు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారంతోపాటు నగదు పురస్కారం అందజేశారు. సభకు ఫౌండేషన్‌ అధ్యక్షుడు బొమ్మిడాల కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా ముఖ్యవక్తగా పాల్గొన్న వీరభద్రుడు మాట్లాడుతూ 20వ శతాబ్దపు సాహిత్య, సంగీతానికి రజనీ కాంతారావు వారధిగా నిలిచారన్నారు. ఓలేటి వెంకట పార్వతీశం రచించిన ఏకాంతసేవ, రజనీ కాంతారావుపై  రచించిన రజనీ పుస్తకాలను ఆవిష్కరించారు. సభలో ఓలేటి పార్వతీశం, ముంజులూరి కృష్ణకుమారి, డాక్టర్‌.భూసరవెల్లి వెంకటేశ్వర్లు, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరశాస్త్రి ప్రసంగించగా సాహిత్యాభిమానులు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మోదుగుల రవికృష్ణ నిర్వహించారు.
మరిన్ని వార్తలు