ఫాదర్‌ ఫెర్రర్‌ ఆశయ సాధనకు కృషి

7 Sep, 2016 00:21 IST|Sakshi

ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్‌
కనుల పండువగా ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహ ప్రతిష్ఠ


కూడేరు :  పేద వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలు, రైతులను ఆర్ధికాభివృద్ధి పరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్‌ ఫెర్రర్‌ ఆశయమని,  ఆయన ఆశయాలను, కలలను నెరవేర్చుతామని ఫెర్రర్‌ సతీమణి,  సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్‌ అన్నారు.  మంగళవారం మండల పరిధిలోని పి.నారాయణపురంలోని ఎస్సీ కాలనీలో గ్రామస్తుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహాన్ని అన్నే ఫెర్రర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌ సావిత్రి,  ఎమ్మెల్సీ  కేశవ్, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువ నాయకుడు కొనకొండ్ల భీమిరెడ్డి, రవికృప గ్రూప్స్‌ అధినేత వన్నూరప్ప, ఆర్డీటీ రీజనల్‌ డైరెక్టర్‌ హనుమంతరాయయుడులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ జిల్లాకు ఓ వరం లాంటిదన్నారు.  ఫాదర్‌ ఫెర్రర్‌ కనిపించే దేవుడని కొనియాడారు. ఆయన సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్యను పొంది ఉన్నతమైన ఉద్యోగాలు పొందడం జరిగిందన్నారు. స్పందించు సహాయం అందించు అనే నినాదంతో ఫెర్రర్‌ ముందుకు వెళ్ళి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు యశోదమ్మ, లక్ష్మన్న, మల్లికార్జున, ఉరవకొండ, కూడేరు ౖÐð ఎస్సార్‌ సీపీ నాయకులు రమణ యాదవ్,సుధాకర్, బాలన్న గౌడ్, విజయ్, నారాయణరెడ్డి, మాధవరెడ్డి, టీడీపీ నాయకులు , గ్రామప్రజలు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు