‘బాపట్ల’కు జ్వరం..

28 Aug, 2016 17:58 IST|Sakshi
‘బాపట్ల’కు జ్వరం..
డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధారాణి
 
బాపట్ల : జిల్లా వ్యాప్తంగా బాపట్ల మండలంలోనే జ్వరాలు అధికంగా ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పద్మజారాణి తెలిపారు. మండలంలోని బేతపూడి గ్రామంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆమె గ్రామంలో పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా 400 మంది జ్వరపీడితులను గుర్తించామన్నారు. వారిలో 185 మంది మలేరియా జ్వరాలు, 33 మందికి డెంగీ లక్షణాలున్నట్లు వెల్లడించారు. జ్వరాలు తగ్గేంత వరకు బేతపూడి గ్రామంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గంలో బలిజపాలెం, కొల్లూరు మండలం, అనంతవరం గ్రామాల్లో జ్వరాల పీడితులున్నారని చెప్పారు.  జిల్లా మలేరియా అధికారి వి. రవీంద్రబాబు, అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌ డి. ఓబులు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ దస్తగిరి,  అప్పికట్ల వైద్యాధికారి కర్రెద్దుల అరవిందబాబు, వెదుళ్ళపల్లి వైద్యాధికారి షేక్‌. సుహానాబేగం, హెల్త్‌ సూపర్‌వైజర్, ఏఎన్‌ఎంలున్నారు.
మరిన్ని వార్తలు