మోరిలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభం

30 Dec, 2016 07:32 IST|Sakshi
  • నగదు రహిత లావాదేవీల పరిశీలన
  • శంకుస్థాపనలు..రుణాల పంపిణీ
  • ఆ గ్రామంలోనే బాబు ఆరు గంటల పర్యటన
  • అమలాపురం :

    ఫైబర్‌ గ్రిడ్‌ పైలెట్‌ ప్రాజెక్టు...నగదురహిత గ్రామం... స్మార్ట్‌ విలేజ్‌.. బహిరంగ మల విసర్జనరహిత గ్రామంగా గుర్తింపు సంతరించుకున్న మోరిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సందర్శించారు. చంద్రబాబు జిల్లా పర్యటన  ఈసారి సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపాడు గ్రామాలకు మాత్రమే పరిమితమైనా ఈ రెండు గ్రామాల్లో ఏకంగా ఆరు గంటలపాటు చంద్రబాబు గడపడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు లబ్ధిదారులకు రుణాలను అందజేశారు.

    గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం...
    చంద్రబాబు పర్యటన గంట ఆలస్యంగా మొదలైంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఉదయం 10 గంటలకు రావాల్సి ఉండగా విజయవాడ నుంచి హెలీకాప్టర్‌లో ఉదయం 11.05 గంటలకు మోరి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కాన్ఫెరె¯Œ్స     సెంటర్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.50 వరకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు చెందిన సీఈవోలతో ఫైబర్‌ గ్రిడ్‌పై చర్చలు జరిపారు. బర్కలీ యూనివర్శిటీ ప్రొఫెసర్, ఎ¯ŒSఆర్‌ఐ సాల్మా¯ŒS డార్వి¯ŒS ఆధ్వర్యంలో 42 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్‌ గ్రిడ్, ఎల్‌ఈడీ, వాటర్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ క్లాస్‌లు తదితర విషయాలపై సుమారు 1.45 గంటలపాటు చర్చలు జరిపారు. ఆయా కంపెనీల సీఈవోలతో ఫైబర్‌ గ్రిడ్, ఎల్‌ఈడీ, వాటర్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ క్లాస్‌లు తదితర విషయాలపైనా చర్చించారు. వారు చేపట్టే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. బాబు అక్కడ నుంచి స్థానిక ఉన్నత పాఠశాలకు చేరుకుని డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ప్రారంభించారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన, డిజిటల్‌ పాఠాలను వీక్షించారు. తరువాత గ్రామంలో పర్యటించి నగదు రహిత లావాదేవీలు నిర్వహించే దుకాణాలను పరిశీలించారు. స్థానిక రంగన్నా మెడికల్‌ స్టోర్స్‌లో నగదు రహిత లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. 1.30 గంటలకు సభా వేదికకు చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని çవేదిక వద్దనే పలు శంకుస్థాపనలు చేశారు. అంతర్వేదిలో రూ.22 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్, శంకరగుప్తం డ్రై¯ŒSపై రూ.13 కోట్లతో నిర్మించే నాలుగు వంతెనలు, రూ.15 కోట్లతో నిర్మించే బ్రాంచ్‌ కెనాల్‌కు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కాపు కార్పొరేష¯ŒS ద్వారా 615 లబ్థిదారులకు రూ.9.35 కోట్ల రుణాలను అందజేశారు. సభలో చంద్రబాబు ఏకంగా 1.15 నిమిషాలపాటు ప్రసంగించారు. మోరి గ్రామం సాధిస్తున్న ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గ్రామంలో 1400 ఇళ్లకు ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా సేవలందుతాయన్నారు. గ్రామంలో ఎల్‌ఈడీ బల్బులను ఆయన ప్రారంభించారు. అమరావతిలోని తన కార్యాలయం నుంచి ఏఏ వీధుల్లో లైట్లు వెలుగుతున్నాయి, వెలగడం లేదని తెలుసుకునే వ్యవస్థ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మోరి సాధించిన విజయాలు స్ఫూర్తినిస్తాయని, ఇదొక నూతన విప్లవమన్నారు. రాష్ట్రమంతా ఈ విధానంలోకి తీసుకువస్తామని బాబు ప్రకటించారు. మోరి గ్రామంలో సేవలందిస్తున్న వివిధ కంపెనీల సీఈవోలను, విద్యార్థులను ఆయన ప్రసంశించారు. అక్కడ నుంచి తిరిగి కాన్ఫెరె¯Œ్స హాల్‌ సమీపంలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన నమూనాలను బాబు పరిశీలించి వచ్చి ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపారు. సాయంత్రం 5.10 గంటలకు హెలీకాఫ్టర్‌లో విజయవాడ బయలుదేరి వెళ్లారు. 
     
    అగ్రి టూరిజానికి పెద్దపీట...
    కోనసీమలో అగ్రి టూరిజానికి పెద్ద పీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత అందాలకు, వ్యవసాయ విధానం, సంప్రదాయ జీవనం పర్యటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇందుకు అగ్రి టూరిజం మంచి ఆదాయవనరుగా గుర్తింపు సంతరించుకుంటుందన్నారు. 
     
    బాబుకు ఘన స్వాగతం...
    మోరి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నర్శింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, కె.రవివర్మ, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, డీసీసీబీ చైర్మ¯ŒS వరపుల రాజా, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్జిబాబు, పిల్లి అనంతలక్ష్మి, తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్సీలు కె.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌లు స్వాగతం పలికార
     
     
మరిన్ని వార్తలు