రోడ్డెక్కిన బంజారాలు

23 Sep, 2016 17:40 IST|Sakshi
రోడ్డెక్కిన బంజారాలు
  • నివేశన స్థలాల కోసం ఆందోళన 
  • నిలిచిన రామగుండం ఫై ్లఓవర్‌ పనులు
  • రామగుండం: రామగుండం పట్టణంలోని రైల్వేఫై ్లఓవర్‌ వంతెన నిర్మాణానికి ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో పనులు ఏళ్ల తరబడి కొనసా....గుతున్నాయి. నిర్వాసితులకు సకాలంలో అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు ఉద్యమబాట పట్టారు. దీంతో మళ్లీ పనులకు బ్రేక్‌ పడింది. వంతెన నిర్మాణంలో 63 గహాలు పూర్తిగా కోల్పోతున్న బంజారాలు రోడ్కెక్కారు. ప్రస్తుతం నివాసముంటున్న కాలనీకి ఫర్లాంగు దూరంలోనే సర్వే నంబర్‌ 376లో లేఅవుట్‌ చేసుకోవచ్చని పక్షం రోజుల క్రితం తహసీల్దార్‌ ఆదేశించడంతో పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అదే స్థలంలో తమకు ఇరవై ఏళ్ల క్రితం పట్టాలు జారీ చేశారంటూ ఇప్పటికే ఇరవై మంది పనులకు అడ్డుతగులుతున్నారు. దీంతో అధికారుల వైఖరిపై బంజారాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
     
    మా జీవితాలతో ఆడుకుంటున్నరు 
    – బానోతు లలిత, బాధితురాలు.
    మూడేళ్ల నుంచి తమ బతుకులకు భరోసా లేకుండా పోతుంది. మా ఇంట్లోలందరం కట్టెలు కొట్టుకుని, కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సార్లు మా ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చిండ్లు. అవి కూడా ఒక్కసారి కాదు. గిప్పుడు జాగలల్ల ఇండ్లు ఆ పైసలతోటి అయితయా. మా బతుకులతో ఆడుకుంటున్నరు.
    ఈ జాగను వదులుకోం....
    – బాతోడు రాజమ్మ 
    మీరు ఇండ్లు కట్టుకోండ్లి... ఎవరైన అస్తే నా దగ్గరికి పంపుండ్లీ.. అంటూ ఎమ్మార్వో సారు చెప్పిండు. మరో సారేమో మీ దగ్గరకు ఎవ్వరు రారు మీరే గొడవలు లేకుండా సర్దుబాటు చేసుకొని తొందరగా ఇండ్లు ఖాళీ చేస్తే  వంతెన నిర్మిస్తామంటూ మమ్మల్ని నమ్మబలుకుతున్నడు. ఏదేమైనా మా ఇండ్ల నిర్మాణం అయ్యే దాకా ఈ జాగా వదులుకునేది లేదు. 
    నిరక్షరాస్యులమనే నిర్లక్ష్యం
    – గగులోతు భాగ్య
    మేము సదువుకోలేదని సార్లు మమ్మల్ని పక్కదారి పట్టిస్తండ్లనిపిస్తుంది. ఇప్పటికే మాకు సూపించిన జాగలో ఇదీ మాదే అంటూ ఎవరెవరో వచ్చి దాని పేపర్లు సూపిత్తండ్లు. మరీ మేము ఈ జాగలో పనులు మొదలుపెట్టినంక మల్లొక్కరు అచ్చి అడ్డుకుంటే మళ్లీ నష్టపోవాల్నా. ఒక్కసారు వారం రోజులు మాదగ్గర ఉంచుండ్లీ ఈ జాగ మాదని ఎవ్వరైనా అస్తే ఆయనే చూసుకుంటడు.
    స్థలాలు చూపించలేదు...
    –  శ్రీనివాస్‌రావు, తహసీల్దార్‌
    నేనిప్పటి వరకు వాళ్లు చదును చేసే స్థలం (మోఖా) వద్దకు వెళ్లలేదు. కాకపోతే ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే కేటాయించేందుకు ప్రయత్నిస్తా. అసలు బాధితులతో తాను ఈ వారంలో చర్చలు జరుపలేదు. బాధితులకు స్థలాలు కేటాయించే ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించాకా స్థలాలను కేటాయించాల్సి ఉంటుంది. 
     
     
మరిన్ని వార్తలు