సమస్యలు తీరే వరకూ పోరాడతాం

3 Sep, 2016 23:31 IST|Sakshi
సమస్యలు తీరే వరకూ పోరాడతాం
ఏలూరు సిటీ: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదని, విద్యాధికారుల విధానాలకు వ్యతిరేకంగా 12 ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌ ఎల్‌.విద్యాసాగర్‌ ప్రారంభించారు. శిబిరానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎల్‌వీ సాగర్‌ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి తన వైఖరి మార్చుకుని తక్షణమే జిల్లా విద్యాశాఖలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేందుకు కృషి చేయాలని, లేకుంటే అతడ్ని సస్పెండ్‌ చేసేవరకూ రాష్ట్ర అధికారులు, నాయకుల దష్టికి ఈ విషయాలను తీసుకువెళతామని హెచ్చరించారు. ఎన్‌జీవోస్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌ఎస్‌ హరనాథ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు భారమైన, స్కూల్‌æక్యాలెండర్‌లో లేని పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను ఎటువంటి బోధనేతర పనులకు ఉపయోగించకూడదని కోరారు.
యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ Sసాబ్జీ మాట్లాడుతూ డీఈవో వైఖరిపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతప్తితో ఉన్నారని చెప్పారు. దీక్షల్లో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, ఏపీటీఎఫ్‌ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ, యూటీఎఫ్‌ కోశాధికారి పీవీ నరసింహారావు, జిల్లా మహిళా అసోసియేట్‌ అధ్యక్షురాలు వి.కనకదుర్గ, రాష్ట్ర కౌన్సిలర్‌ సుభానీబేగం, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్, డి.పద్మావతి, టి.పూర్ణశ్రీ, ఆర్‌.కమలారాణి, ఎన్‌.వేళాంగిణి, సీహెచ్‌ మణిమాల పాల్గొన్నారు. దీక్షలకు ఆపస్‌ జిల్లా అధ్యక్షుడు రాజకుమార్, పీఆర్టీయూ నగర అధ్యక్షులు నెరుసు రాంబాబు, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.నరహరి, వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జి.సుధీర్‌ తదితరులు మద్దతు తెలిపారు. 
 
 
>
మరిన్ని వార్తలు