.. ‘బాయ్‌ఫ్రెండ్స్‌’సందడి

26 Dec, 2016 22:10 IST|Sakshi
కాకినాడ కల్చరల్‌/ కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : 
చిన్న సినిమాకు పెద్ద విజయాన్నిచ్చి తమను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని ‘‘నేను.. నాన్న.. నా బాయ్‌ప్రెండ్స్‌’’ సినిమా యూనిట్‌ తెలిపింది. ఆ సినిమా విజయయాత్రలో భాగంగా చిత్ర హీరోలు అశ్విన్, కేరింత నాగరాజు, నోయల్‌తో పాటు చిత్ర యూనిట్‌ జిల్లాలోని  రాజమహేంద్రవరం, కాకినాడలో సందడి చేసింది. రాజమహేంద్రవరం అనుశ్రీ థియేటర్, కాకినాడ సీ అండ్‌సీ(చాణుక్య, చంద్రగుప్త) థియేటర్‌లలో   జరిగిన కార్యక్రమాల్లో చిత్ర హీరోల్లో ఒకరైన అశ్వి¯ŒS మాట్లాడుతూ తాను ఈ జిల్లావాడినేనని, నేను నటించిన ఈ చిత్రం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కూతరు, తండ్రి ఎలా ఉంటున్నారు? ఎలా ఉండాలనే దానిపై చక్కని కథాంశంతో సినిమా నడుస్తుందన్నారు. తాను నటించిన తొలి సినిమా ’రాజుగారి గది’, రెండో చిత్రం ’జత కలిసే’ మంచి విజయాలు సాధించాయన్నారు. మరో హీరో  కేరింత నూకరాజు మాట్లాడుతూ తనకు కేరింత తొలి సినిమా అయితే రోజుల మారాయి రెండోదన్నారు. మూడో సినిమా నేను.. నాన్న..నా బాయ్‌ప్రెండ్స్‌తో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మరో హీరో నోయల్‌ మాట్లాడుతూ చిత్ర దర్శకులు ఈ సినిమాలో తనకు మంచి గుర్తింపునిచ్చే పాత్రను ఇచ్చారన్నారు. చిత్ర దర్శకులు బండి భాస్కర్‌ మాట్లాడుతూ ప్రథమంలో అనుకున్నది ఒకటి సినిమా పూర్తయ్యేసరికి పెద్ద సినిమాలా మారిపోయిందన్నారు. దీనిలో రావురమేష్‌ పాత్ర చాలా ప్రత్యేకమని, ఆయన దీనికి జీవం పోశారన్నారు. తాను నిర్మించిన తొలి చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం థియేటర్‌లో కొంతసేపు అభిమానులతో ముచ్చటించారు. కార్యక్రమంలో అనుశ్రీ సినిమాస్‌ అధినేత సత్యనారాయణ, చిత్ర పంపిణీదారులు చిన్ని, థియేటర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు