మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

20 Jul, 2016 17:53 IST|Sakshi
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

నడిగూడెం: మండలంలోని నడిగూడెం, తెల్లబెల్లి గ్రామాల్లోని సొసైటీలలో బుధవారం ముగ్గురు మృతుల కుటుంబాలకు ఆయా సొసైటీల చైర్మన్లు ఆర్థికసాయాన్ని అందచేశారు. మండలంలోని త్రిపురవరం గ్రామానికి చెందిన రైతులు బి.నర్సిరెడ్డి, కె.వెంకటరెడ్డి,వాయిల సింగారం గ్రామానికి చెందిన పుల్లయ్య  వీరు ఇటీవల అనారోగ్యానికి గురై మృతిచెందారు. దీంతో వీరి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.పదివేల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సొసైటీల చైర్మన్లు దేవబత్తిన సురేష్‌ప్రసాద్, చుండూరు వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ పందిరి పాపిరెడ్డి,  డైరెక్టర్లు అంబటి శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు, పుల్లయ్య, కోటయ్య, కొల్లు సుబ్బారావు, ఎన్‌.శ్రీనివాస్, డి.శ్రీనివాస్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మన్నేం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు