షార్ట్‌ సర్క్యూట్‌తో బట్టల షాపులు దగ్ధం

23 Nov, 2016 23:34 IST|Sakshi
షార్ట్‌ సర్క్యూట్‌తో బట్టల షాపులు దగ్ధం
తప్పిన పెనుముప్పు
రూ.కోటి విలువైన వస్రా్తలు దగ్ధం
ట్రాన్‌సఫార్మర్‌ హేవీ లోడ్‌తో మంటలు వ్యాప్తి
రాజమహేంద్రవరం క్రైం : కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడంతో నగరంలోని తాడితోటలో వస్త్ర దుకాణాలు దగ్ధమైయ్యాయి. బుధవారం స్థానిక మహాత్మా గాంధీ హోల్‌ సేల్‌ క్లాత్‌ మార్కెట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల షాపు నెంబర్‌ 98, 113, 112 షాపులకు మంటలు వ్యాపించాయి. కింద షాపులో శ్రీదుర్గా హోమ్‌ డెకరేటర్స్‌ షాపు నిర్వహిస్తుండగా పైన ఉన్న షాపులను గౌడౌన్లుగా వినియోగిస్తున్నారు. ముందుగా మధ్య ఉన్న దుకాణానికి బయట ఏర్పాటు చేసిన ట్రాన్‌ సఫార్మర్‌లో హైలోడ్‌ రావడంతో వైర్‌ కాలుతూ మధ్య గోడౌ¯ŒSకు మంటలు వ్యాపించాయి. ఈ గొడౌన్‌  కు రెండు వైపులా షటర్లకు లోపల నుంచి తాళాలు వేసి ఉండడం వల్ల సకాలంలో తాళాలు తీయలేకపోయారు. దీనితో పండుగల కోసం నిల్వ చేసిన దుస్తులు బూడిదయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. ఇతర షాపుల సిబ్బంది మిగిలి ఉన్న దస్తులను అక్కడ నుంచి తీసి ఆటోలో వేరే ప్రాంతాలకు తరలించారు.  
తప్పిన ముప్పు
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సభవించకపోవడం ఒకటైతే, మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఫైర్‌ ఆఫీసర్‌ పార్ధసారథి అన్నారు. ఈ ప్రమాదంలో కోటి రూపాయలు విలువైన వస్రా్తలు కాలిబూడిదయ్యాయని షాపుల యజమాని ములకల ఆనంద్‌ తెలిపారు.
మరిన్ని వార్తలు