హోటల్‌లో అగ్నిప్రమాదం

2 Oct, 2016 19:59 IST|Sakshi

అఫ్జల్‌గంజ్‌: ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఓ.పి విభాగం గేటు పక్కన ఉన్న సాగర్‌దర్శిని హోటల్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. సీఐ అంజయ్య కథనం ప్రకారం.. హోటల్‌లోని వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగాయన్నారు. సిబ్బంది అప్రమత్తతతో మంటలార్పారని, తమ పోలీస్ సిబ్బంది కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం లేకుండా చూశారని సీఐ తెలిపారు. సిలిండర్ పేలి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. ఎటువంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు