కొనసాగుతున్న భగభగలు!

3 Jun, 2017 00:09 IST|Sakshi
- ఖరీఫ్‌ మొదలైనా తగ్గని ఉష్ణోగ్రతలు
- గత ఏడాదితో పోలిస్తే 12 డిగ్రీలు అధికం
- గూడూరులో అత్యధికంగా 42.53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా..ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. గత ఏడాది జూన్‌ 2వ తేదీన ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకే ఉన్నాయి. అయితే ఈ నెల 2వ తేదీన అత్యధికంగా 42.53 డిగ్రీలు ఉండటం గమానార్హం. వడగాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఖరీప్‌ సీజన్‌ మొదలయినా చినుక జాడ లేకపోవడం సర్వత్రా అందోళన కలిగిస్తోంది.  గత ఏడాది ఖరీప్‌ ప్రారంభంతోనే వర్షాలు మొదలయ్యాయి. జూన్‌ 1వ తేదీనుంచే విత్తనం పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది మాత్రం వేసవి కొనసాగుతుండడం అందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకినా.. వర్షాల జాడ మాత్రం కనిపించలేదు. మే నెలలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడ్డాయి. జూన్‌ నెలలో ఎండల తీవ్రత తగ్గాల్సి ఉండగా యథావిధిగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంఓ సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు డిమాండ్‌ లేకుండా పోయింది. 
 
శుక్రవారం నాటి ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
మండలం నమోదయిన ఉష్ణోగ్రతలు
గూడూరు 42.53
నందికొట్కూరు 42.32
చాగలమర్రి 42.28
ఆళ్లగడ్డ 42.08
రుద్రవరం 41.93
డోన్‌ 41.86
 
మరిన్ని వార్తలు