తొలి పరిశోధనాత్మక పాత్రికేయుడు కందుకూరి

12 Dec, 2016 14:48 IST|Sakshi
తొలి పరిశోధనాత్మక పాత్రికేయుడు కందుకూరి
తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ సంజీవరావు 
రాజమహేంద్రవరం కల్చరల్‌ : పరిశోధనాత్మక జర్నలిజానికి మూలపురుషుడు కందుకూరి వీరేశలింగమని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ పి.వి.బి.సంజీవరావు అన్నారు. ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో ఆవరణలో జరుగుతున్న నవ్యాంధ్రపుస్తక సంబరాలు కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఆయన కందుకూరి నాటకాలపై ప్రసంగించారు.1876లో కందుకూరి రచించిన బ్రాహ్మవివాహంలో చిన్నమ్మ పాత్ర కనపడదు, వినపడుతుందన్నారు. ఈ నాటకానికి పెద్దయ్యగారి పెళ్ళి అని నాటి ప్రేక్షకులు పేరుపెట్టారని తెలిపారు. కందుకూరి రచించిన రెండో నాటకం వ్యవహార ధర్మబోధినికి ప్రజలు ప్లీడర్ల నాటకమని పేరు పెట్టారని తెలిపారు. న్యాయ, పోలీస్, మున్సిపల్‌ వ్యవస్థల్లోని లోపాలను ఈ నాటకం ద్వారా కందుకూరి ఎత్తిచూపారన్నారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత రీడర్‌ చాగంటి శరత్‌బాబు మాట్లాడుతూ కందుకూరి నిర్వహించిన వితంతు వివాహాలు జాతి సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు ప్రచారం చేశారని, ఇది సరికాదన్నారు. పరాశరస్మృతిలో భర్త గతించినప్పుడు స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చునని తెలిపారని చెప్పారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌, తెలుగు లెక్చరర్‌ బి.వి.రమాదేవి ఆవంత్స సోమసుందరం సాహిత్యంపై ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ టి.సత్యనారాయణ స్వాగత వచనాలు పలికారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు