సేవాపథంలో షష్టిపూర్తి

28 Oct, 2016 22:20 IST|Sakshi
సేవాపథంలో షష్టిపూర్తి
  • కోనసీమలో తొలి మహిళా వైద్యురాలు గోటేటి సరస్వతి
  • సత్యసాయిబాబా ఆదర్శంగా 60 ఏళ్లుగా వైద్యసేవలు
  • గుర్తింపుగా విశ్వమాత ఈశ్వరమ్మ జీవనసాఫల్య పురస్కారం
  • అమలాపురం టౌ¯ŒS :
    ఆమె పుట్టపర్తి భగవా¯ŒS సత్యసాయి సేవా మార్గంలోనే అరవై ఏళ్లుగా అడుగులు వేస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యురాలైన ఆమె ఆ వృత్తి ద్వారానే ప్రజలకు ఉచిత సేవలు అందించారు. అమలాపురంలోనే కాదు.. కోనసీమలో తొలి మహిళా వైద్యురాలిగా డాక్టర్‌ గోటేటి సరస్వతి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితురాలే. అందుకే ఆమెను భగవా¯ŒS సత్యసాయి బాబా తల్లి విశ్వమాత ఈశ్వరమ్మ జీవన సాఫల్య పురస్కారం వెతుక్కుంటూ వచ్చి వరించింది. పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థలు  60 ఏళ్లుగా వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న వారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తే అందులో ఒకరు డాక్టర్‌ సరస్వతమ్మ. రాజమహేంద్రవరంలో గల సత్యసాయి సేవా మందిరంలో సత్యసాయి సేవా సంస్థల రెండు రాష్ట్రాల అధ్యక్షుడు ఎ¯ŒSజీ చలం చేతుల మీదుగా డాక్టర్‌ సరస్వతమ్మ గురువారం ఈ  జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్‌ సరస్వతమ్మ కూడా రాష్ట్ర సత్య సాయి సేవా సంస్థల్లో అనేక కీలక పదవులు చేశారు. సత్యసాయి బాబాకు అత్యంత విశ్వసనీయంగా ఉన్న వ్యక్తుల్లో సరస్వతమ్మ ఒకరు.
    అమలాపురం నుంచి సేవా ప్రస్థానం
    అమలాపురం యరమ్రిల్లివారి వీధిలో నివసిస్తున్న ఆమె 1955 నుంచి పట్టణంలో ఆస్పత్రి నిర్వహిస్తూ ప్రజల నుంచి నామమాత్రపు ఫీజలతో ఎన్నో ఏళ్లు వైద్య సేవలు అందించారు. అప్పటి నుంచే సర్వతిమ్మ పుట్టపర్తి సత్యసాయి బాబా చేస్తున్న సేవలకు ప్రభావితురాలై తాను కూడా ఆ సేవా మార్గాన్నే ఎంచుకున్నారు. తన ఆస్పత్రి ద్వారా కొన్నాళ్లు ఉచిత వైద్యం అందించి పుట్టపర్తికి వచ్చే యాత్రికులకు అక్కడి  ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసుతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నారు. అమలాపురంలో నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపం, సత్యసాయి సేవా మందిరం నిర్వహణ బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆమెను అమలాపురంలో పలువురు ప్రముఖులు శుక్రవారం సత్కరించారు.
    సరస్వతమ్మ ఇంటికి సత్యసాయి..
    సత్యసాయి భక్తురాలైన డాక్టర్‌ సరస్వతమ్మ ఇంటికి 1964 ప్రాంతంలో సత్యసాయి బాబా స్వయంగా వచ్చారు. ఆమె ఇంటి నుంచే బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పటంతో పాటు డాక్టర్‌గా సరస్వతి చేస్తున్న వైద్య సేవలను కొనియాడారు. 1986 ప్రాంతంలో బీజేపీ నేత, మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి కూడా ఆమె ఇంటికి వచ్చి చేస్తున్న సేవలకు కితాబు ఇచ్చారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా సరస్వతి చేస్తున్న సేవలకు మెచ్చి ఆమె ఇంటికి స్వయంగా వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
     
    మృగ్యమైన సేవాభావం 
    ‘మా రోజుల్లో వైద్య వృత్తి చేపట్టిన వారిలో వ్యాపార దృక్పథం ఉండేది కాదు. వారిలో సేవా భావం ఉండేది. ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం రోగుల నుంచి నామమాత్రపు ఫీజులు తీసుకునే వా’రని జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్‌ సరస్వతమ్మ అన్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా ’సాక్షి’ శుక్రవారం అమలాపురంలోని ఆమె స్వగృహంలో కలసి మాట్లాడినప్పుడు నాడు...నేడు వైద్య సేవల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఆవేదనాభరితంగానే వివరించారు. ‘అప్పట్లో నా వద్దకు వచ్చే రోగుల ఆర్థిక స్థితిగతులను కూడా గమనించే దాన్ని. ఫీజుగా వారిచ్చినంత మేము పుచ్చుకున్నంత అన్నట్లుగా డబ్బులు తీసుకునేవాళ్లం. నేనైతే వైద్యం చేసి ఇన్ని డబ్బులు ఇవ్వమని ఎప్పుడూ అడగలే’దని ఆమె చెప్పారు. రోగులు పేదోళ్‌లైతే వెళ్లేటప్పుడు రిక్షాకు డబ్బులిచ్చి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు.
    – డాక్టర్‌ సరస్వతమ్మ
     
మరిన్ని వార్తలు