ఆపరేషన్‌ స్మైల్‌..!

28 Dec, 2016 00:43 IST|Sakshi

నల్లగొండ : ఆపరేషన్‌ స్మైల్‌ మొదటి విడతను 2015 జనవరి 1న  ప్రారంభిం చారు. ఆ తర్వాత ప్రతి ఏడు నెలలకో సారి స్మైల్‌ రెండు సార్లు, ముస్కాన్‌ పేరుతో రెండు సార్లు నిర్వహించారు. రెండేళ్లలో ఇప్పటి వరకు నాలుగు విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్మైల్, ముస్కాన్‌ పేర్లతో నిర్వహించిన తనిఖీల్లో 1259 మంది బాలబాలికలను గుర్తించారు. దీంట్లో 1194 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు అప్పగించారు. మిగిలిన 65 మంది బాల, బాలికలను ప్రభుత్వ, ప్రభుత్యేతర సంస్థల్లో ఆశ్రయం కల్పించారు. బాల కార్మిక చట్టం ప్రకారం కార్మి క శాఖ ద్వారా 19 మంది యజమానుల నుంచి రూ.1.40 లక్షలు జరిమాన విధించి వసూలు చేశారు.

నెల రోజుల ఆపరేషన్‌..
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఆపరేషన్‌ స్మైల్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులతో పోలీస్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొ ందించింది. దీనికోసం ఒక్కో డివిజన్‌కు ఒక్కో బృందం చొప్పున నల్లగొండ జిల్లాలో నల్ల గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, యాదాద్రి జిల్లాలో చౌటుప్పుల్, భువనగిరి డివిజన్లకు ప్రత్యేక టీమ్‌లను నియమిస్తున్నారు. ఒక్కో టీమ్‌లో ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, దాంట్లో మహిళా కానిస్టేబుల్‌ ఒకరు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ఒక ఉద్యోగి, కార్మిక శాఖ నుంచి మరొకరు ఉంటారు. ఈ ఐదు టీమ్‌లు నెల రోజుల పాటు ఆయా డివిజన్ల పరిధిలోని పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు, కర్మాగారాల్లో విస్తృత తనిఖీలు చేస్తారు. ఎక్కడైనా అనాథలు, తప్పి పోయిన చిన్నారులు, బాల కార్మికులు కనిపిస్తే వారిని తమ అదుపులోకి తీసుకుని రక్షణ కల్పిస్తారు.

అన్ని చోట్ల తనిఖీలు..
ప్రభుత్వ అనుమతి పొందిన అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర వసతి గృ హాల్లో కూడా స్మైల్‌ బృందాలు తనిఖీ చేస్తాయి. వివిధ కారణాలతో ఇక్కడ ఆశ్రయం పొం దుతున్న వారిని కూడా గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి తప్పిపోయి వచ్చిన వారిని, పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్న బాల, బాలి కలను గుర్తించి తమ సొంత ఇళ్లకు పంపిస్తారు.

బాల కార్మికులే అధికం..
ఆపరేషన్‌ స్మైల్, ముస్కాన్‌ కింద గతంలో పట్టుబడిన వారిలో అధికంగా బాలకార్మికులే ఉ న్నారు. అనేక మంది చిన్నారులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద భిక్షాటన చేయడం, మరికొంత మంది చిన్నారులు ఇంటినుంచి పారిపోయి రావడం, చిన్నా చితకా ఫ్యాక్టరీలు, కిరాణ దుకాణాలు, దాబాలు, హోటళ్లలో వెట్టిచాకిరీ చేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారందరినీ రక్షించి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ స్మైల్‌  ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థాయిలో సీఐడీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ఈ కార్యక్ర మాన్ని జిల్లా స్థాయిలో పోలీస్‌ శాఖకు అప్పగించారు. దీంట్లో మిగిలిన శాఖలతో పోలిస్తే పోలీస్‌ శాఖ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు