తొలి దశ ఉద్యమం చరిత్రాత్మకం

12 Aug, 2016 11:43 IST|Sakshi
తొలి దశ ఉద్యమం చరిత్రాత్మకం
బెల్లంపల్లి : 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమం ఎంతో చరిత్రాత్మకమైందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవనంలో ఏబూషి పోశం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ యోధుల సన్మాన సభ జరిగింది. ముఖ్య అతిథిగా స్పీకర్ హాజరై మాట్లాడారు. మలి దశ ఉద్యమానికి 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. అప్పట్లో ఉన్న ఏకైక రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులు లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేకపోయిందని పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను ఓర్చుకొని తొలి దశ ఉద్యమంలో అనేక మంది ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. మలి దశ ఉద్యమంలో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలం ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని శాంతియుత పద్ధతిలో సాధించుకున్నామని వివరించారు. తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న యోధులను సన్మానించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని వివరించారు. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మాట్లాడుతూ, సమస్త ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. 
 
 సభాముఖంగా బెల్లంపల్లి జిల్లా రగడ
బెల్లంపల్లి జిల్లా కోసం ఎమ్మెల్యే దుర్గం చి న్నయ్య, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ సన్మాన సభలో మల్లేశ్ మాట్లాడుతూ, బెల్లంపల్లి జి ల్లా కోసం అధికారపక్ష ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోవ లక్ష్మిల గొంతు పెకిలే అవకాశాలు లేవని, మంచిర్యాల జిల్లా కోసం ఇ క్కడి ఎమ్మెల్యే సంతకం చేశారని ఆరోపించా రు. ప్రజాప్రతినిధులు కళ్లు మూసుకుంటే సమస్యలు పరిష్కారం కావని ధ్వజమెత్తారు. దీనికి ఎమ్మెల్యే చిన్నయ్య దీటు గా స్పందించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లేశ్ నియోజకవర్గంలోని మారుమూల పల్లెల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మంచి ర్యాల జిల్లా కోసం సంతకం చేసినట్లు నిరూపిస్తే తక్షణమే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. స్పీకర్ మధుసూదనాచారి బెల్లంపల్లి జిల్లా అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సభాముఖంగా చేసుకున్న విమర్శలు సభలో వేడి పుట్టించాయి.
 
 
 
 
 
మరిన్ని వార్తలు