నిషే«ధం ఉన్నా నిర్భయంగావేట

5 Aug, 2017 00:32 IST|Sakshi
నిషే«ధం ఉన్నా నిర్భయంగావేట
కొవ్వూరు రూరల్‌:
నిబందనలు ఉన్నా అమలు చేసేవారే ఉండరు. ఒకవేళ నిబందనలు ప్రదర్శించినా బయపడేవారు ఉండరు. ముఖ్యంగా జూన్‌ నుంచి ఆగష్టు నెలాఖరు వరకూ గోదావరి నదిలో గుడ్డు దశ నుంచి మత్స్య సంపద పెరుగుతుంది. ఈ సమయంలో నదిలో చేపలవేటను కూడా అధికారులు నిషేదిస్తుంటారు. అయితే అదే సమయంలో గోదావరిలో చేరే కొత్త నీటితో రొయ్య, చేపపిల్లలు విరివిగా దొరుకుతుంటాయి. దీనినే అక్రమార్కులు తమ వ్యాపారానికి మరల్చుకుంటున్నారు. ఆయా సమయంలో వేటపై నిషేదం ఉన్నా అది అమలు కావడం లేదు. కొవ్వూరు మండలం మద్దూరులంకలో బ్యారేజ్‌ వద్ద రొయ్య సీడ్‌ను పట్టుకుని అమ్ముకునే వ్యాపారం జొరుగా సాగుతుంది. అదే విదంగా గోదావరి పరివాహకప్రాంతంలో రొయ్య పిల్లలు చేప పిల్లలను పట్టి ఎండబెట్టి కోళ్ల మేతకు అమ్ముకుంటున్నారు. పిల్ల దశలో గోదావరిలో మత్స్య సంపదను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జాలర్లు వలల ద్వారా పట్టుకుంటే నదిలో అవి పెరగవని, తమ జీవనాధారం పోతుందంటూ రెండు నెలల క్రితం  తాళ్లపూడి మండలంలోని జాలర్లు వేటను అడ్డుకున్నారు. ఈ విదంగా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టనట్టే ఉంటారు. తూతూ మంత్రంగా సీడ్‌ పట్టే ప్రాంతంలో నిబందనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటారు. ఇప్పటికైనా గోదావరిలో అక్రమ వేటను నిరోదించి మత్స్యసంపదను కాపాడాలని కోరుతున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు